కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజకీయ ప్రచారాన్ని హోరెత్తించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మిర్యాలగూడ (Miryalaguda) గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులతో మాట్లాడిన సీఎం మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పనిచేయాలన్నారు. ‘పార్టీలో ఉన్న వారందరినీ కలుపుకుని వెళ్లాలి. ఏ ఒక్కరినీ విస్మరించవద్దు. మనకు ప్రతి ఓటూ ముఖ్యం. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే విజయం సాధ్యం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుపై (Bhaskar Rao) ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జానా రెడ్డి వంటి సీనియర్ నేతను ఓడించడానికి భాస్కర్ రావు కుట్రలు చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికలతో బీఆర్ఎస్ (BRS) ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం రేవంత్ (Revanth Reddy) అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఉందని, అందుకే నా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టాను” అని సీఎం రేవంత్ ప్రకటించారు.
Read Also: కాంగ్రెస్ పాలనలో బలహీనవర్గాలకు అన్యాయం : బీజేపీ చీఫ్ నితిన్ నబిన్
Follow Us On: Instagram


