కలం, వెబ్డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో బుధవారం మళ్లీ అదే తీరు. అధికార, విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య లోక్సభ గురువారానికి వాయిదా పడింది (Lok Sabha). ఈ ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే.. డోక్లాం సంఘటనపై మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే ఆత్మకథలోని మాటల్ని రాహుల్ మరోసారి ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో ఇండియా కూటమి సభ్యులు భగ్గుమన్నారు.
ప్రతిగా అధికార పార్టీ ఎంపీలు బదులివ్వడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో గందరగోళం చెలరేగింది. దీంతో సభ వాయిదా పడింది. అనంతరం సమావేశమైనప్పటికీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది. సభను (Lok Sabha) మరోసారి వాయిదా వేశారు. చివరగా సాయంత్రం 5గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
Read Also: విద్యుత్ స్థంభాలు, గృహ కనెక్షన్లపై కీలక మార్పులు
Follow Us On: Sharechat


