Mobile Popup Ad
Mobile Popup Ad

గుండు కార్మికుడిని గుర్తుపట్టని ఉపాధి హామీ యాప్

కలం, వెబ్ డెస్క్ : టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని సందర్భాలలో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా మహబూబాబాద్ (Mahabubabad)  జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులలో అలాంటి ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కార్మికుల హాజరు నమోదు కోసం ఉపయోగించే ఉపాధి హామీ యాప్ (NMMS App) ఓ కార్మికుడిని గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గుండు చేయించుకున్న కారణంగా యాప్ అతని ముఖాన్ని స్కాన్ చేయలేకపోయింది.

పని ప్రదేశంలో పలుమార్లు ఫేస్ స్కాన్ చేసినప్పటికీ అటెండెన్స్ నమోదు కాలేదు. దీంతో అక్కడే ఉన్న మహిళా కూలీలు వినూత్నంగా ఆలోచించారు. ఒక మహిళా కార్మికురాలు తన జుట్టుతో ఆ వ్యక్తి తలను కవర్ చేయగా, వెంటనే యాప్ (NMMS App) ముఖాన్ని గుర్తించి హాజరు నమోదు చేసింది. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు నవ్వులు పూయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : మణిశర్మ మ్యాజిక్.. ‘వదలనే’ సాంగ్ చార్ట్‌బస్టర్

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>