కలం, వెబ్ డెస్క్ : రేపు (మే 2) లక్షలాది ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపిస్తుంది. ఫ్లాష్ మెసేజ్ తో కూడిన సైరన్ వస్తుందని.. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సూచించింది. భవిష్యత్తులో ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పౌరులను కాపాడటానికి భారత్ సొంతంగా ఒక హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. సెల్ బ్రాడ్ కాస్ట్ అలర్ట్ అని పిలువబడే ఈ వ్యవస్థను NDMA (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) దేశవ్యాప్తంగా పరీక్షిస్తున్నారు.
ఈ క్రమంలో NDMA నుండి అలర్ట్ మెసేజ్ వస్తుందని.. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదని లక్షలాది మందికి సైరన్ ఎస్ఎంఎస్ వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ హెచ్చరికలను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) అభివృద్ధి చేసిన స్వదేశీ సమీకృత హెచ్చరిక వ్యవస్థ (SACHET) ద్వారా పంపించబడతాయి. ఈ వ్యవస్థ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (CAP) ఆధారపడి పనిచేస్తుంది.

