Mobile Popup Ad
Mobile Popup Ad

అమావాస్య ఎఫెక్ట్.. నిజామాబాద్‌లో 17 నుంచి ప్రైవేట్ స్కూల్స్

కలం, నిజామాబాద్ బ్యూరో : పాఠశాలల పునఃప్రారంభ తేదీలలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటగా జూన్ 12న ప్రారంభించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం జూన్ 15వ తేదీ సోమవారంనుంచి తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే ఆ రోజు అమావాస్య కావడంతో తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. “అమావాస్య రోజు పిల్లలను స్కూల్‌కు ఎలా పంపాలి?” అంటూ పలువురు పేరెంట్స్ సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో (Nizamabad) ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు పెద్ద ఎత్తున ఫోన్లు, విన్నపాలు వెల్లువెత్తాయి.

సరస్వతీ దేవాలయంగా భావించే విద్యాలయాలకు అమావాస్య రోజున పిల్లలను పంపడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పేరెంట్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న పలు ప్రైవేట్ స్కూల్ (Private Schools) యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 15న కాకుండా జూన్ 17వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభిస్తామని ప్రకటించాయి. ఈ మేరకు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా సమాచారం అందించారు. ఈ నిర్ణయంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండ్రోజులకు మరో రెండు రోజులు హాలిడేస్ లభించడంతో స్టూడెంట్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు.

Read Also: షాకింగ్.. గోల్డ్ దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యారు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>