క్వీన్స్ క్లబ్‌లో సంచలనం.. టాప్ సీడ్ రైబాకినాకు షాక్

క‌లం, వెబ్ డెస్క్: క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్స్‌లో బ్రిటన్‌కు చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్​ కేటీ బౌల్టర్ (Katie Boulter) భారీ సంచలనం సృష్టించింది. టోర్నీ టాప్ సీడ్ ఎలెనా రైబాకినా (Elena Rybakina)ను 7-5, 2-6, 7-5తో ఓడించి సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో రైబాకినాపై బౌల్టర్ తొలి గెలుపును నమోదు చేసింది. గతంలో 2023 వింబుల్డన్, 2025 ఇండియన్ వెల్స్ టోర్నీల్లో రైబాకినా చేతిలో బౌల్టర్ ఓడిపోయింది. ఆ ఓటమి తనను చాలా కాలం వెంటాడిందని, ఈసారి మరింత ధైర్యంగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మ్యాచ్ అనంతరం తెలిపింది.

వర్షం కారణంగా గురువారం మ్యాచ్‌లు వాయిదా పడటంతో బౌల్టర్‌కు శుక్రవారం కఠిన పరీక్ష ఎదురైంది. ఉదయం రెండో రౌండ్‌లో జాక్వెలిన్ క్రిస్టియన్‌ను 6-3, 6-1తో ఓడించిన ఆమె, తర్వాత క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ నంబర్-2 రైబాకినాపై విజయం సాధించింది. ఇప్పుడు సెమీఫైనల్‌లో బౌల్టర్ క్రొయేషియాకు చెందిన డోనా వెకిచ్‌ను ఎదుర్కొననుంది. వెకిచ్ కూడా శుక్రవారం రెండు మ్యాచ్‌లు ఆడి, క్వార్టర్‌ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్-1 కరోలినా ప్లిస్కోవాను 6-4, 4-6, 6-3తో ఓడించింది.

మరోవైపు అమెరికా యువ ఆటగాళి ఇవా జోవిచ్ కూడా సెమీఫైనల్ చేరింది. ఆమె అమాండా అనిసిమోవాపై మూడు సెట్ల పోరులో విజయం సాధించింది. జోవిచ్ తదుపరి మ్యాచ్‌లో ఎమ్మా రాడుకాను లేదా కమిల్లా రఖిమోవాలో ఒకరిని ఎదుర్కొనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>