Mobile Popup Ad
Mobile Popup Ad

ఈడీ, ఈవీఎంలు ఉన్నాయ‌నే బీజేపీ ధీమా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

క‌లం, వెబ్ డెస్క్: ప‌దేళ్ల కాలానికి పైగా ప‌లు ర‌కాలుగా దేశ ప్ర‌జ‌ల‌ను బీజేపీ ప్ర‌భుత్వం ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీ కృష్ణ (Gaddam Vamsi Krishna) విమ‌ర్శించారు. డీమోనిటైజేష‌న్‌, జీఎస్టీ క‌ష్టాలు, ఇప్పుడు పెట్రోల్ క‌ష్టాలు ఇలా.. ప్ర‌జ‌ల‌పై ఎన్ని అరాచ‌కాలు చేసినా మేమే గెలుస్తామ‌న్న ధీమాతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. దీనికి కార‌ణం ఈడీ, సీబీఐ, ఈవీఎంలు త‌మ చేతిలో ఉండ‌ట‌మేన‌ని చెప్పారు. ఇలాంటి బీజేపీ పోక‌డ‌లు దేశ భ‌విష్య‌త్తుకు ఎంత‌మాత్రం మంచివి కావ‌న్నారు. గల్ఫ్‌లో భారత నౌకలపై అమెరికా దాడి చేసినా కేంద్రం ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. ఈ దాడిలో ముగ్గురు భార‌తీయులు చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోదీ త‌న ప‌న్నెండేళ్ల పాల‌న‌పై థ్యాంక్స్ చెప్తూ ట్రంప్‌కు ట్వీట్ చేశార‌ని, కానీ భార‌తీయుల మృతిపై ప్ర‌శ్నించ‌లేద‌ని మండిప‌డ్డారు.

దేశ ప్ర‌జ‌లంతా కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) అన్నారు. పెట్రోల్ ధ‌ర‌లు, గ్యాస్ షార్టేజ్‌, ధ‌ర‌ల పెంపు.. ఇలా ఎన్ని జ‌రుగుతున్నా కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌లు అంద‌రూ మేల్కొని దీనికి ఎదురుదెబ్బ కొట్టాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీ తెలంగాణ‌ను పాకిస్థాన్‌తో పోల్చ‌డం ఆపాల‌ని ఎంపీ సూచించారు. తెలంగాణ ప్ర‌జలు ఆశీర్వ‌దిస్తేనే మంత్రి అయిన విష‌యం కిష‌న్ రెడ్డి గుర్తుంచుకోవాల‌న్నారు. సింగరేణి కార్మికుల రిటైర్డ్ పెన్ష‌న్ కోసం పార్లమెంట్‌లో ప్ర‌తి సారి కోరుతున్నామ‌ని, ఇప్ప‌టికే కిషన్ రెడ్డిని చాలా సార్లు దీని గురించి అడిగామ‌ని గుర్తు చేశారు. బీజేపీకి తెలంగాణ‌పై ప్రేమ ఉంటే కిష‌న్ రెడ్డి త‌క్ష‌ణ‌మే సింగ‌రేణి పెన్ష‌న్ల పెంపున‌కు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: రాంగ్ రూట్‌లో ఆర్టీసీ బ‌స్సు.. ఇంట్రెస్టింగ్‌గా మారిన పెండింగ్ చ‌లాన్లు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>