కలం, నిజామాబాద్ బ్యూరో: పౌరులు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్(Flag March) నిర్వహించారు. ఖిల్లా చౌరస్తా నుండి హష్మీ కాలనీ మీదుగా శాంతి నగర్ ఈద్గా వరకు ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. నిజామాబాద్ లో రాబోయే మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఫ్లాగ్ మార్చ్ లో నిజామాబాద్ నగర ఏసీపీతో పాటు, నిజామాబాద్ లోని పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, 5వ టౌన్ కానిస్టేబుల్ లతో సహా సుమారు 150 మంది పోలీసులు పాల్గొన్నారు.
Read Also: ఢిల్లీ చేరిన కవిత ఫైల్స్.. మూడు నెలల్లో కొలిక్కి…
Follow Us On: X(Twitter)


