కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిని వేధించిన ఘటనలో ట్యూటర్‌పై జీవితకాల సస్పెన్షన్ వేటు (Tutor Suspended) పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కాలేజీలో రెండో ఏడాది చదువుతున్న ఓ విద్యార్థినిని ట్యూటర్ గౌతమ్ వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సదరు ట్యూటర్ ఫోన్‌లో తరుచూ తనను వేధించేవాడని విద్యార్థిని పోలీసులకు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ ఈ ఘటనపై విచారణ కమిటీ వేశారు. స్టూడెంట్‌పై వేధింపులు నిజమేనని ఎంక్వైరీలో తేలడంతో ట్యూటర్‌పై జీవితకాల వేటువేశారు. ఇలాంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.

