‘ఫోన్ పే’లో వసూళ్లు.. నిజామాబాద్ లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ సస్పెండ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా సౌత్ రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీవో) సంయుక్త సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో పాటు పీఆర్వో రికార్డులు తారుమారు చేసినట్లుగా విచారణలో తేలింది. ఈ మేరకు ఆమెను విధుల నుంచి తొలగిస్తూ డీ‌ఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. సంయుక్త బీట్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో కలప పేరుతో ఓ వ్యక్తి వద్ద నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది. ఫిర్యాదుల రూపంలో వచ్చిన ఆరోపణలన్నీ విచారణలో నిజమని గుర్తించారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>