Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ కలెక్టరేట్‌లో దత్తత హెల్ప్ డెస్క్ ప్రారంభం

కలం, నిజామాబాద్ బ్యూరో: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ బాలల భద్రత డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో దత్తత సహాయ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ (Kiran Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య (Mission Vatsalya) పోర్టల్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. అక్రమ దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

కలెక్టరేట్ ప్రాంగణంలో వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు కావాల్సిన పత్రాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను అందజేయాలని సూచించారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన దంపతులకు అబ్బాయిని దత్తత ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్, కార్యాలయం సిబ్బంది అనిత, అనిల్, ముజాహిద్, స్రవంతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>