మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం బాదం నూనె చిట్కాలు

కలం, వెబ్ డెస్క్: బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. అదే విధంగా బాదం నూనె ( Almond Oil) కూడా జుట్టు, చర్మ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందని (Benefits) చెబుతున్నారు సౌందర్య నిపుణులు. బాదం నూనెలో విటమిన్–ఇ, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే బాదం నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెసుసుకుందాం.

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో బాదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం.. వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారు బాదం, ఆముదం, ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని కలపాలి. ఇలా కలిపిన ఆయిల్ తో జుట్టు కుదుళ్లను మర్దన చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతున్నారు.

అంతే కాకుండా కొంత మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఖరీదైన క్రీములు కొనకుండా రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని కళ్ల కింద అప్లై చేసుకోవాలట. అలా కాసేపు మృదువుగా మర్దన చేసుకోవడం వలన ఈ సమస్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

నేటి డిజిటల్ యుగంలో యువతను వేధిస్తున్న మరొక సమస్య చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావడం. ఈ సమస్యను తగ్గించడంలో బాదం నూనె ఉపయోగపడుతుంది. బాదంలో ఉండే యాంటీ ఏజింగ్ కారకాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయట. దీనికోసం బాదం నూనెను తరచుగా చర్మానికి మర్దనా చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు.

నిర్జీవమైన చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంలో బాదం నూనె ఉపయోగపడుతుంది. దీనికోసం 2 స్పూన్ల పెసరపిండిని తీసుకోవాలి. దీంట్లో తగినంత బాదం నూనెను కలుపుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి నలుగులా పెట్టుకుంటే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుందని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>