గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో : వచ్చే ఏడాది జూన్, జూలై మాసాలలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర కన్సల్టెంట్ కుహూ గుప్తాతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

గోదావరి పరీవాహక ప్రాంతాలైన తుంగిని, పోచంపాడ్, తడ్ పాకల్ పుష్కర ప్రదేశాల వద్ద చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన వసతులపై చర్చించారు. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ తో కూడిన పోచంపాడ్ పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు వీ.ఐ.పీలు, వీ.వీ.ఐ.పీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాల పార్కింగ్, సరైన రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తడ్ పాకల్, తుంగిని పుష్కరఘాట్ల వద్ద కూడా అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తేవాలన్నారు.

పుష్కర ఘాట్ల వరకు అప్రోచ్ రోడ్లు, పుష్కర ఘాట్ల మరమ్మతులు వంటి పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్దేశిత పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఇప్పటికే ఆమోదం తెలిపిన పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని, అవసరమైన కొత్త పనులను గుర్తిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎండోమెంట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>