కలం మెదక్ బ్యూరో: పశ్చిమ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గించడంతోపాటు లక్షలాది మంది నిత్యం ప్రయాణం చేసే ముంబై జాతీయరహదారిపై సాఫీగా, వేగంగా ప్రయాణం చేయడమే లక్ష్యంగా మదీనా గూడ నుండి సంగారెడ్డి చౌరస్తా వరకు ఇప్పటి వరకు ఉన్న 4 లైన్ల రోడ్లను 6 లైన్ల రోడ్డుగా విస్తరించే భారీ ప్రాజెక్టు (Mumbai Highway Expansion)ను నేషనల్ హైవే అధారిటి అఫ్ ఇండియా మొదలుపెట్టింది. అయితే పనులు మొదలై రేండేళ్ల గడుస్తున్న హైవే విస్తరణ పనులు అనుకున్నంతా వేగంగా జరగడం లేదు. విస్తరణ జరుగుతున్న 30 కిలోమిటార్ల మేర ఎక్కడచూసిన రొడ్డు విస్తరణ పనులతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పశ్చిమ హైదరాబాద్ ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతమైన మియాపూర్ ,పటాన్ చెరువు నుండి ముంబాయి వెళ్లే జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 పై నిత్యం లక్షలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నగర విస్తరణ కారణంగా మియాపూర్ , మదీనా గూడ నుండి మొదలు నుండి శివారు ప్రాంతంగా ఉన్న సంగారెడ్డి వరకు విపరీతమైన వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ప్రధాన రహదారిని 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కేవలం 6 లైన్ల మెయిన్ రోడ్డు మాత్రమే కాకుండా, దీనికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు కలిపితే కొన్ని చోట్ల ఇది ఏకంగా 60 మీటర్ల దాదాపు 200 అడుగులు వెడల్పుతో హైదరాబాద్‌లోనే అత్యంత విశాలమైన ప్రధాన రహదారుల్లో ఒకటిగా మారనుంది.
మదీనా గూడ –సంగారెడ్డి రహదారి 6 లేన్‌గా విస్తరణలో భాగంగా మొత్తం 31 కి.మీ పొడవుమేర జాతీయరహదారిని విస్తరణ చేయబోతున్నారు. నగరంలో ప్రదాన రహదారులను విస్తరిస్తూ వెళ్లే భారీ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 1400 కోట్ల అంచనా వేశారు.ఇందులో హైవే విస్తరణ , రోడ్డు నిర్మాణానికి 1000 కోట్లు, , విస్తరణ కోసం రోడ్డు ఇరువైపులు భూసేకరణకు 400 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇప్పటివరకు ఉన్న నాలుగు లేన్ల రొడ్డు నుంచి 6 లేన్లరొడ్లుగా..200 అడుగుల వెడల్పుతో భారీ రొడ్ల నిర్మాణం చేయబొతున్నారు. రొడ్డు నిర్మాణంలొ భాగంగాఆ అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు,అండర్ పాస్ లతో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేసేలా రొడ్డు విస్తరణ ప్రణాళికను రూపొందించారు.
ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. నగర విస్తరణలో అత్యంత కీలక ప్రాంతాలుగా ఉన్న మదీనా గూడ, బిహెచ్ఈఎల్ సర్కిల్ , పటాన్‌చెరు బస్ స్టాండ్ ఏరియా,ముత్తంగి ఒఅర్అర్ దగ్గర, ఇస్నాపూర్ చౌరస్తా , లక్డారం గేటు ,రుద్రారం గ్రామం,గణేష్ గడ్డ టెంపుల్, కంది ఐఐటీ దగ్గర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఈ విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించే అవకాశంతో పాటు, ఐటీ కారిడార్ మరియు శివారు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. శివారు ప్రాంతాల అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశముంది.
నెమ్మదిగా విస్తరణ పనులు..
ఈ 6 లైన్ల రొడ్డు విస్తరణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యేడాది చివర వరకు పూర్తి స్ధాయిలో విస్తరణ పనులు పూర్తి చేయాలి. కానీ ప్రసుత్తం రొడ్డు విస్తరణ పనులు జరుగుతున్న చూస్తే అది సాధ్యమయ్యేలా కనబడం లేదు. ఇప్పటి వరకు కేవలం 40 నుండి 50 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ, నిర్మాణాల తొలగింపు సమస్యలు విస్తరణ పనులకు బ్రేక్ వేస్తున్నాయి. దింతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మిషన్ భగీరథ మరియు మంజీరా తాగునీటి పైప్‌లైన్లు, ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించి వేరే చోటుకి మార్చడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.
నిత్యం వేలాది భారీ వాహనాలు, పరిశ్రమల లారీలు వెళ్లే ఈ రహదారిపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి పనులు చేయడం కాంట్రాక్టర్ కు అసాధ్యంగా మారింది. కేవలం రాత్రి వేళల్లో రొడ్డు విస్తరణ పనులు చేస్తుండటంతో వేగం తగ్గింది. వీలైనంత తర్వగా పనులు పూర్తి చేసేలా ప్రయత్నం జరుగుతుందని ,ప్రజలు సహకరించాలని కొరుతున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం గతనెల జాతీయ రహదారి-65పై సంగారెడ్డి నుండి పటాన్‌చెరు వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ,సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రోడ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ పాయింట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తరలింపు, నీటి పైప్‌లైన్ల షిఫ్టింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.జాతీయ రహదారి రోడ్డు విస్తరణకు ప్రభావితమవుతున్న నివాస భవనాల యజమానులకు పరిహారం చెల్లించి, వాటి తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ,రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తిచేయలని అదేశించారు కలెక్టర్.
సగం సగం పనులు – ట్రాఫిక్ కష్టాలు
హైవే విస్తరణ పనుల జాప్యం కారణంగా 30 కిలోమిటార్ల మేర రోజు కిలోమిటార్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏ ప్రాంతంలో కుడా పూర్తి స్ధాయిలో పనులను చేయడం లేదు, సగం సగం పనులు చేస్తు విడిచిపెడుతున్నారు. ఇలా విస్తరణ కోసం రోడ్లను తవ్వడం,నిర్మాణంను సంబంధించిన మెటీరియల్ రోడ్డు మీద వేయడం రెండు వైపుల ఒకే వరుస రోడ్ల పై మాత్రమే వాహనలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో బీహెచ్ఈఎల్ నుండి సంగారెడ్డి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తి.. వాహనదారులు అవస్ధలు పడుతున్నారు. పనులు ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్న ఏ ఒక్క ప్రాంతంలో కుడా పూర్తి స్ధాయిలో అరు లైన్లుగా రొడ్డు విస్తరణ జరగలేదు.
పటాన్ చెరువు, ఇస్నాపూర్,లక్డారం గేటు, గణేశ్ గడ్డ ,కంది ఐఐటి వద్ద ఫ్లైఓవర్లు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక్కడ సగం సగం పనులు మాత్రమే చేసే వదిలివేస్తున్నారు. దింతో ఫ్లైఓవర్లు నిర్మాణ ప్రాంతలకు ఇరువైపుల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. రోడ్డుకు ఇరువైపుల కేబుల్ లైన్ల కోసం , డ్రైనేజి కోసం వేస్తున్న ప్రత్యేక లైన్లు నెమ్మదిగా సాగుతున్నాయి. విస్తరణ, నిర్మాణ పనులు కారణంగా విపరీతమైన దుమ్ము, దూళి వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తుంది.
పనులు అనుకున్నంతా వేగంగా జరగకపోయడం లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ పనుల జాప్యం కారణంగా గత రెండు యేళ్లు గా ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, ప్రస్తుత పరిస్ధితి చూస్తే మరో రెండేళ్లు విస్తరణ పనులు జరిగేలా ఉన్నయని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సగం ,సగం పనులు చేయకుండా.. ప్రణాళిక బద్దంగా ప్రధానమైన ఫ్లైఓవర్లు నిర్మాణం, సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తే సగం సమస్య తొలిగిపోతుందని చెబుతున్నారు.

