కలం, నిజామాబాద్ బ్యూరో: హైదరాబాద్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జుల ముఖ్య నాయకులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, మాజీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా SIR బాధ్యులు వి.జి.గౌడ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా షకీల్, కామారెడ్డి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు ముజీబొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టతపై నాయకులు చర్చించారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంపై సమీక్షించుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేలా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడం వంటి అంశాలపై కీలకంగా చర్చించారు..

