నిజామాబాద్ ఐటీఐ జాబ్ మేళాకు భారీ స్పందన

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు(Nizamabad ITI Job Mela) విశేష స్పందన లభించింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 24 ప్రముఖ కంపెనీలు హాజరయ్యాయి. వివిధ ట్రేడ్లకు చెందిన 306 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు, అప్రెంటిస్‌షిప్ అవకాశాల కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, పనితీరు తదితర అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.

ఎంపిక ప్రక్రియ అనంతరం 150 మంది అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్‌కు, 80 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో 46 మందికి జాబ్ మేళా వేదికపైనే కంపెనీల ప్రతినిధులు ఆఫర్ లెటర్లు అందజేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి మాట్లాడుతూ.. ఐటీఐ విద్యార్థులు, ఉత్తీర్ణులను నేరుగా కంపెనీలతో అనుసంధానం చేయడం ద్వారా వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. యువత తమ సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>