Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి : నిజామాబాద్ అదనపు కలెక్టర్

నిజామాబాద్, బ్యూరో : ప్రజా వాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 177 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి.భుజంగరావుతో పాటు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ బి.గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావులకు అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీసు ప్రజావాణి లో 40 ఫిర్యాదులు

నిజామాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు చట్ట ప్రకారం పరిష్కరించాలని ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా సేవలందించాలన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ స్పష్టం చేశారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 40 ఫిర్యాదులను స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>