Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌మీట్‌కు నితీశ్‌ బ్రేక్

కలం, స్పోర్ట్స్: టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) నేడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న నితీశ్‌.. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రెస్‌మీట్ కొనసాగుతున్న సమయంలో ఫోన్ మోగడంతో కాసేపు ఆగిన నితీశ్ కాల్ ఎవరిదో చూసి చిరునవ్వు నవ్వాడు. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గుర్తించిన నితీశ్ వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను సెకన్లపాటు ఆపివేసి సంతోషకరమైన ముఖారవిందంతో అమ్మతో మాట్లాడాడు.

తల్లితో ఎంతో ఆప్యాయంగా తెలుగులో మాట్లాడిన ఆయన (Nitish Kumar Reddy), “అమ్మా.. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తాను” అని చెప్పి కాల్ ముగించారు. అనంతరం తిరిగి మీడియా ప్రతినిధులతో మాట్లాడడం ప్రారంభించారు. ఈ సంఘటన అక్కడున్న వారిని మనస్సుకు హత్తుకునేలా చేసింది. అమ్మ ప్రేమ, అమ్మపై అతనికి ఉన్న ఆప్యాయతను చూసిన అక్కడివారు సంతోషించారు. క్రీడాకారులు ఎంతటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా కుటుంబ బంధాలను, ముఖ్యంగా తల్లితో ఉన్న అనుబంధాన్ని మరచిపోరని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read Also: బల్క్ ఆర్డర్ పేరిట స్వీట్ షాప్ ఓనర్‌కి టోకరా.. స్కూటీతో ఉడాయించిన కేటుగాడు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>