Mobile Popup Ad
Mobile Popup Ad

కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జూన్ 20వ తేదీన నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి (SP Janaki) పిలుపునిచ్చారు. ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ లోక్ అదాలత్ ద్వారా అనేక న్యాయ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉందని ఆమె తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ (SP Janaki) మాట్లాడుతూ.. ట్రాఫిక్ చలానాలు, చిన్న చిన్న క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, రాజీకి అనుకూలమైన ఇతర కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో (National Lok Adalat) పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సాధారణ కోర్టు ప్రక్రియతో పోలిస్తే తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో సమస్యలను ముగించుకునే అవకాశం ఈ విధానంలో ఉంటుందని చెప్పారు. ఇరు పక్షాల అంగీకారంతో శాంతియుతంగా వివాదాలను పరిష్కరించడం వల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు సామాజిక సామరస్యానికి కూడా ఇది దోహదపడుతుందని వివరించారు.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కక్షిదారులు ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని ఎస్పీ సూచించారు. రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని, అందువల్ల జూన్ 20న నిర్వహించే రెండవ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read Also: దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారా? : ప్రధానిపై రాహుల్ తీవ్ర విమర్శలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>