తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన ఖరారు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని అంటున్న బీజేపీ పెద్దలు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin)  తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు.

మూడు రోజుల పాటు సాగే తెలంగాణ పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే నితిన్ నబీన్ (Nitin Nabin) పర్యటనలో టీబీజేపీ (TBJP) స్టేట్ ఎక్సిక్యూటివ్ మీటింగ్ జరగనుంది. నితిన్ నబీన్ పర్యటనలో భాగంగా వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డిలో జిల్లాలో మీటింగ్‌లకు స్థానిక బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా చోట్ల జరిగే మీటింగ్ లకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: ప్రధాని మోదీకి సీజేపీ బహిరంగ లేఖ.. రేపటి నుంచి భారీ నిరసన!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>