కలం, వెబ్ డెస్క్ : అమెరికా మధ్యంతర ఎన్నికల (US Midterm Elections) ఫలితాలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ట్రంప్ నేతృత్వంలోని డెమోక్రాట్లకు ఎదురుదెబ్బ తగలడంపై ఇరాన్ స్పందించింది. ఈ మేరకు ఎన్నికల ఫలితాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలు యుద్ధాన్ని స్పష్టంగా తిరస్కరించారని తెలిపారు. ఓటర్లు తమ తీర్పు ద్వారా యుద్ధానికి వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చారన్నారు.
అమెరికన్లు తమ మనస్సాక్షి, జీవ వ్యయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఘాలిబాఫ్ చెప్పారు. అమెకన్ల సందేశాన్ని తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ స్పీకర్ హెచ్చరించారు. అంతర్జాతీయ ఆర్థిక శక్తులకు, బ్లాక్ మెయిలర్లకు సేవ చేయడానికి అమెరికన్ల అభిప్రాయాన్ని విస్మరించకూడదని ఆయన సూచించారు.

