అమరావతిలో తుఫాను బీభత్సం: జలమయమైన రాజధాని

కలం, వెబ్ డెస్క్ : మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతం జలమయమైంది. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్‌మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్ వర్షపు నీటితో నిండిపోయింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సమీప పరిసరాలు చెరువును తలపిస్తుండగా, వీఐటీ యూనివర్సిటీ వద్ద నీటి ఎత్తిపోత కోసం సిబ్బంది భారీ కెపాసిటీ మోటార్లను ఏర్పాటు చేసి నిరంతరం శ్రమిస్తున్నారు.

రైతుల ఇంటి స్థలాల రోడ్లు సైతం నీట మునిగిపోయాయి. పొలాల నుంచి వచ్చిన నీరు ప్రధాన రహదారులపైకి చేరడంతో అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>