కవయిత్రి మొల్లమాంబకు సముచిత గౌరవం.. భూమిపూజకు ఏర్పాట్లు

కలం, వనపర్తి : తెలుగుజాతి గర్వించదగ్గ తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Mollamamba) అని మాజీ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం, శ్రీరంగాపురం కుమ్మరి సంఘం నాయకుడు గోవిందు అన్నారు. బుధవారం శ్రీరంగాపురం మండలంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం ఉందని, ఎలాంటి రాజాస్థానాల అండ లేకుండానే సామాన్యులకు సైతం అర్థమయ్యే అచ్చమైన తెలుగులో రామాయణాన్ని రచించి శ్రీరాముడికి అంకితం చేసిన మహాకవయిత్రి అని కొనియాడారు.

ఈ నెల 11న వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా మొల్లమాంబ విగ్రహ భూమిపూజ (Bhoomi Pooja)  కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని కుమ్మర కుటుంబ సభ్యులు, కుల పెద్దలు, యువత, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొడ్డుపల్లి మన్యం, సంఘం మండల అధ్యక్షుడు శేఖర్, ఉపాధ్యక్షుడు ఎల్లస్వామి, యువజన అధ్యక్షుడు సురేష్, శ్రీరంగాపురం పట్టణ అధ్యక్షుడు తిరుపతయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>