కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని 11 కేవీ వెంకటాపూర్ ఫీడర్ పరిధిలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయనున్నట్లు ఏడీఈ శ్రీనివాస్‌రావు గురువారం తెలిపారు. విద్యుత్ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెంకటాపూర్, బృందావన్ కాలనీ, హెచ్‌పీ గ్యాస్ గోదాం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

