కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం జాబితాపూర్ గ్రామ శివారులోని జగిత్యాల – గొల్లపెల్లి ప్రధాన రహదారిపై నాలుగు రోజుల క్రితం పడిన చెట్టు ఇప్పటికీ తొలగించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్టు రహదారి పక్కకు ఒరిగి ఉండటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఈ రహదారిపై నిత్యం వేళల్లో వాహనాలు, పాఠశాల బస్సులు ప్రయాణిస్తుంటాయి.
అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు చెట్టును తొలగించే చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్టు పడినచోట రాత్రి వేళల్లో తగినంత వెలుతురు లేకపోవడంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు చెట్టు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి దారి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!
Follow Us On : WhatsApp

