గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!

కలం, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని (Gujarat) మోర్బీ (Morbi) జిల్లా వీర్‌పర్డా గ్రామంలో ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రహదారి పక్కన ఉన్న ఓ బావిలోని (Mysterious Well)  నీరు ఒక వైపు నుంచి మరో వైపుకు నిరంతరం కదులుతూ కనిపిస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్థానికుల సమాచారం ప్రకారం, సమీపంలోని ఇతర బావులలో నీరు పూర్తిగా ప్రశాంతంగానే ఉండగా, ఈ ఒక్క బావిలో మాత్రమే ఇలా నీరు అలల మాదిరిగా కదులుతోంది. భూగర్భ జలాల ఒత్తిడి లేదా ఇతర సహజ కారణాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నప్పటికీ, దీనిపై నిపుణులు ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>