నిర్మల్‌ సబ్‌జైలులో న్యాయ సేవలపై సమీక్ష

కలం, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి(Nirmal DLSA Secretary) పి. రవీందర్‌ బుధవారం నిర్మల్‌ సబ్‌జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు జైలులో అందుతున్న సౌకర్యాలు, న్యాయ సహాయం తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్నారు. ఖైదీలకు ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని రవీందర్‌ తెలిపారు. అలాగే ఖైదీల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. న్యాయ సహాయం అవసరమైన వారు సంబంధిత అధికారులను సంప్రదించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ సబ్‌జైలు సూపరింటెండెంట్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>