బోథ్‌లో కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ.. కేసీఆర్‌పై విమర్శలు

కలం, నిర్మల్‌: ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌(KCR) పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఒక్కరోజు కూడా ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను పట్టించుకోలేదని కాంగ్రెస్‌ పార్టీ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌ (Ade Gajender) విమర్శించారు. కేసీఆర్‌ ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బోథ్‌, సోనాల మండలాల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అంతకుముందు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో గజేందర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్‌ వెంటనే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు సాగుతోందని గజేందర్‌ పేర్కొన్నారు. బోథ్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>