నిర్మల్‌లో వీధి వ్యాపారులకు స్వనిధి అవగాహన

కలం, నిర్మల్‌: నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో బుధవారం వీధి వ్యాపారులకు రుణ స్వీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామ్‌ గోపాల్‌ మాట్లాడుతూ.. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వనిధి ప్రచారం, లోక్‌ కల్యాణ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వనిధి పథకం(PM SVANidhi) ద్వారా వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి వీధి వ్యాపారి స్వనిధి పథకం ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రామ్‌ గోపాల్‌ సూచించారు. అనంతరం వీధి వ్యాపారుల నుంచి స్వనిధి రుణాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో టీఎంసీ సావిత్రి, ఆర్‌పీ శివకుమార్‌, బ్యాంక్‌ మేనేజర్‌ జోషి, బ్యాంక్‌ సిబ్బంది, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>