Mobile Popup Ad
Mobile Popup Ad

టీచర్లకు బిగ్ అప్డేట్.. జాతీయ అవార్డులకు దరఖాస్తులు ప్రారంభం

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న(DEO Bhojanna) జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు (National Teachers Awards 2026) అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్ ద్వారా స్వీయ నామినేషన్‌లను  ఆహ్వానించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మైనారిటీ సంక్షేమ, ఆదర్శ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు (https://nationalawardstoteachers.education.gov.in) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ స్వీయ నామినేషన్‌లను సమర్పించాలని సూచించారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారాలను అందిపుచ్చుకునే అవకాశాన్ని అర్హులైన ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి (DEO Bhojanna) విజ్ఞప్తి చేశారు.

Read Also: అడ్లూరి vs కొప్పుల.. ధర్మపురిలో వేడెక్కిన రాజకీయం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>