Mobile Popup Ad
Mobile Popup Ad

కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు: జడ్జి శ్రీవాణి

కలం, నిర్మల్: కష్టపడి చదివితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి (Judge Sreevani) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో గల బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో, శ్రీ కాంచన చారిటేబుల్ ట్రస్ట్ సహకారంతో శనివారం ఏడు కంప్యూటర్ల (Computers) ను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె (Judge Sreevani) మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులను, ఉపాధ్యాయులను చూస్తుంటే తన చిన్ననాటి విద్యాభ్యాస రోజులు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని, దానికి క్రమశిక్షణ, పట్టుదల, కృషి అవసరమని చెప్పారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also: అడ్లూరి vs కొప్పుల.. ధర్మపురిలో వేడెక్కిన రాజకీయం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>