భూముల సర్వేపై అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: జిల్లాలో భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పారదర్శకతతో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న భూముల సర్వేపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన భూముల సర్వే, ఇంకా చేపట్టాల్సిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.

సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనాలని, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సర్వే తీరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అధునాతన పరికరాలను వినియోగించడం ద్వారా సర్వే ప్రక్రియను సులభంగా, మరింత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి సర్వేను పూర్తి చేయాలని సూచించారు. సర్వే నిర్వహణ కోసం నూతన ల్యాప్‌టాప్‌లను కలెక్టర్ అధికారులకు అందజేశారు.

అనంతరం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్‌తో కలిసి ఆర్థిక అక్షరాస్యత అవగాహన, సహాయం, ఆర్థిక అక్షరాస్యత కేంద్రానికి సంబంధించిన గోడ ప్రతులను డీఈవో భోజన్న, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ దేవీదాస్, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>