విద్యార్థులపై దౌర్జన్యం.. సీఐ సస్పెన్షన్​..!

కలం, మహబూబాబాద్ : శక్తి స్కీమ్, జీవో-97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ రఘపతి రెడ్డి (CI Raghupathi Reddy) ని ప్రస్తుతం విధులనుండీ తప్పించి సమగ్ర విచారణకు జిల్లా ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. నిరసన చేపట్టిన విద్యార్థులను అడ్డుకునే క్రమంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకుని కొంత సేపు వదలలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా? ఇదేనా పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో ఈఘటనపై సమగ్ర విచారణకు ఎస్పీ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>