కలం, నిర్మల్: ఎంపీ గోడం నగేష్ (MP Godam Nagesh) ను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ బీజేపీ కౌన్సిలర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. కౌన్సిలర్ల వినతిపై స్పందించిన ఎంపీ.. త్వరలోనే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, జింక సూరి, రావులవారి విఠల్, సూరజ్ నాయక్, నాయకులు ఒడిసెల అర్జున్, ధర్మాజీగారి ఈశ్వర్, వెంకటేష్, పూదరి రంజిత్, కందుల హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

