పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: నేరేడుగొమ్ము (Neredugommu) మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) అన్నారు. గురువారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న అండర్‌డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దశలవారీగా అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం గొర్ల ధనలక్ష్మి–ఆంజనేయులు, చిల్లా అనూష–ఆంజనేయులు, వరికుప్పల వెంకటమ్మ–కాశయ్య, వరికుప్పల మహేశ్వరి–వెంకన్న, హనుమంతు ఈదమ్మ–ఈదయ్య, నాగటి శారద–కృష్ణయ్య కుటుంబాలకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, 2026–27 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.5,500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మరోవైపు నేరేడుగొమ్ము, పందిరిగుండుతండా, జోడుబావి తండా, చర్లతండా గ్రామాలకు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. ఇదే వేదికపై బీఆర్‌ఎస్‌ మాజీ వార్డు సభ్యుడు బొమ్మనోని లింగయ్య, సీనియర్ నాయకుడు బైకని సాలయ్యలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎమ్మెల్యే బాలు నాయక్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు.

రైతుల సమస్యలపై హామీ: ఎమ్మెల్యే బాలునాయక్

నేరేడుగొమ్ము పరిధిలోని 630 సర్వే నంబర్ రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, అర్హత కలిగిన ప్రతి రైతుకూ పట్టాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెళ్లిపాకుల రిజర్వాయర్‌ కోసం భూములు కోల్పోయిన 630 సర్వే నంబర్ రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సమస్యలను సత్వరమే, పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, మండల అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్, జిల్లా కార్యదర్శి లోకసాని కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>