కలం, నిర్మల్: ప్రజావాణిలో (Prajavani) అందిన దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (Nirmal Additional Collector) బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని సూచించారు.
మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి, వాటికి వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేష్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఆర్డీవో దేవీదాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read : ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?
Follow Us On: X(Twitter)

