కటింగ్ షాపులో కోతి సందడి.. బార్బర్ మసాజ్‌కు ఫిదా!

కలం, వెబ్ డెస్క్: కోతి అనగానే చాలామంది ఒకింత భయం. ఏవైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో కూడా తెలియదు. కానీ ఓ బార్బర్ మాత్రం కోతిని కుర్చీలో పడుకోబెట్టి, ఏకంగా మసాజ్ చేసి ఆశ్చర్యపర్చాడు. ఆహారం కోసం తిరుగుతూ అలసిపోయిందో ఏమో.. ఆ కోతి సెలూన్‌లోకి వెళ్లి కుర్చీలో కూర్చుంది. బార్బర్ కూడా భయపడలేదు. పైగా దానికి మసాజ్ చేయడంతో.. కోతి కళ్లు మూసుకుని రిలాక్స్ అయ్యింది. మనుషులు ఏవిధంగా మసాజ్ చేయించుకుంటారో, అలాగే చేయించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫన్నీ వీడియోను నాగాలాండ్ (Nagaland) మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మంకేశ్ భాయ్ మసాజ్ ఎంజాయ్ చేస్తున్నారు.. డిస్టర్బ్ చేయకండి” అంటూ ఆయన చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Also Read : గోల్స్ వర్షం.. రికార్డు మ్యాచ్‌తో భారత్ జోరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>