జూరాల ముట్టడికి యత్నం.. నిరంజన్ రెడ్డి నిర్బంధం

కలం, వనపర్తి: జూరాల ప్రాజెక్టు నీటిలో తాగునీటి అవసరాలు పోను మిగిలిన నీటిని సాగుకు విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు ముట్టడికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు వ్యవసాయ క్షేత్రంలో అదుపులోకి తీసుకుని వనపర్తిలో గృహ నిర్బంధం చేశారు. అక్కడి నుంచే ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ఎస్‌ఈ తదితర అధికారులతో నీటి లభ్యతపై చర్చించారు. జూరాలలో సుమారు 9 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, తాగునీటి అవసరాలకు సుమారు 2 టీఎంసీలు అవసరమవుతాయని చెప్పారు. మిగిలిన 7 టీఎంసీలను సాగునీటికి విడుదల చేయాలని కోరారు.

ఆలమట్టిలో నీరు ఉన్నా..

నీటి లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం వలనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. నికరంగా లభించే నీటిని ఆరుతడి పంటలకు అందించాలని కోరారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి నియోజకవర్గాల్లో వరి సాగు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతుల పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కరెంట్ కోతలతో మోటార్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్‌ తెచ్చిన కరువు అంటూ నిరంజన్‌రెడ్డి విమర్శలు చేశారు. శ్రీశైలం నుంచి 670 కిలోమీటర్ల దూరంలోని కుప్పం ప్రాంతానికి నీటిని తరలించే చర్యలు చేపడుతున్నప్పుడు, పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆలమట్టిలో నీటి లభ్యత ఉందని, అక్కడి నుంచి సాగునీరు తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>