మహిళా ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులు.. వర్సిటీలో ఆందోళన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అల్దాస్ జానయ్య (VC Aldas Janaiah) మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మద్దతుగా వర్సిటీలోని ఇతర ప్రొఫెసర్లు, సిబ్బంది, పలు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. వీసీపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంపై మహిళా ప్రొఫెసర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితురాలు ఈ విషయాన్ని మూడు నెలల కిందటే మాకు చెప్పారని.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పినా భయపడి చేయలేదని ఒక ప్రొఫెసర్ తెలిపారు. ధైర్యం చేసి ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించడంతో అల్దాస్ జానయ్య భయపడి.. బాధిత ప్రొఫెసర్‌ను రుద్రూర్ వ్యవసాయ కాలేజీకి బదిలీ చేశారని ఆరోపించారు. అల్దాస్ జానయ్య ఎలా వేధించాడో.. ఎప్పుడెప్పుడు ఫోన్ చేశాడో.. అన్ని ఆధారాలు బాధితురాలి వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

వారిపై విచారణ చేయాలి..

అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల అంశంపై విద్యార్థి నేతలు భగ్గుమన్నారు. వీసీ అల్దాస్ జానయ్య పక్కన సిండికేట్ బ్యాచ్ తయారైందని.. ప్రొఫెసర్ల ముసుగులో కొందరు బ్రోకర్లుగా మారిపోయారని ఆరోపించారు. వర్సిటీ పరిపాలనా భవనాలను అసాంఘిక కార్యక్రమాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. వర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి.. నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నవారిని తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలన్నారు. అంతకుముందు బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఫిర్యాదు చేస్తే నీ పరువే పోతుందని బెదిరించారని, కేసు కూడా నమోదు చేయకపోవడంపై బయటకు రాలేక తప్పలేదని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>