కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal ) అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అనంతరం చర్చను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కొన్ని బిల్లులను భావి తరాలు మరవలేవని చెప్పారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. లోక్ సభలో సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచనున్నట్లు తెలిపారు. పెంచగా ఉన్న 815 స్థానాల్లో మహిళల కోసం 272 సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. లోక్ సభలో 1/3 వంతు సీట్లు మహిళలకు పెరుగుతాయని వెల్లడించారు. ఈ బిల్లు ద్వారా ఏ రాష్ట్రానికి కూడా నష్టం వాటిల్లదు అని కేంద్రమంత్రి (Arjun Ram Meghwal) స్పష్టం చేశారు.

