కలం, వెబ్ డెస్క్: మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలంగాణలో పలువురిపై విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులకు అధికారులు నోటీసులు (Notices) జారీ చేశారు. గతేడాది నవంబర్‌లో హైదరాబాద్ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా సదరు వ్యక్తులకు వద్ద ఉన్న సమాచారం గురించి ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నోటీసు ప్రకారం మార్చి 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నోటీసులు (NIA Notices) పొందిన వ్యక్తి తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని డీఎస్పీ ఆదేశించారు. ఒకవేళ తన నివాసంలో కాకుండా వేరే ప్రాంతంలో విచారణకు హాజరు కావాలనుకుంటే, ఆ విషయాన్ని మార్చి 15లోపు అధికారులకు తెలియజేయాలని సూచించారు. దేశద్రోహ కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదైన ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
Read Also: సీబీఐ నోటీసులపై కవిత రియాక్షన్!
Follow Us On: Facebook

