LPG గ్యాస్ సిలిండర్ కొరతపై పార్లమెంట్‌లో చర్చ పెట్టాలి : ఎంపీ చామల

కలం, వెబ్ డెస్క్ : దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు వంట గ్యాస్ కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. చామల మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్, యుద్ధ పరిస్థితులపై ఇంకా సమగ్రంగా మాట్లాడలేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

అంతేగాక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏం చెబుతాడో అదే ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అనుసరిస్తున్నారని  విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎంపీ చామల పార్లమెంట్‌లో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రత్యేక చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Read Also: కవిత ఇంటికి సీబీఐ ఆఫీసర్లు.. అందుకున్న భర్త

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>