ఎర్రకోట పేలుడు కేసులో సంచలనం: 7500 పేజీల ఛార్జిషీట్!

కలం, వెబ్‌ డెస్క్‌ : న్యూఢిల్లీ ఎర్రకోట పరిసర ప్రాంతంలో జరిగిన భీకర కార్ బాంబు పేలుడు (Red Fort Bomb Blast) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక అడుగు వేసింది. ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. 2025 నవంబర్ 10వ తేదీన దేశ రాజధానిని వణికించిన ఈ శక్తివంతమైన పేలుడు పదార్థం (VBIED) భారీ ఆస్తి నష్టాన్ని చేకూర్చింది. ఈ కుట్ర వెనుక ఉన్న పదిమంది నిందితులపై ఎన్ఐఏ అధికారులు 7,500 పేజీల భారీ ఛార్జిషీట్‌ను పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేశారు. అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ (AGuH) అనే ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వీరంతా అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఇప్పటికే మరణించగా మిగిలిన తొమ్మిది మంది నిందితుల పేర్లను ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆమిర్ రషీద్ మీర్, జాసిర్ బిలాల్ వాని, డాక్టర్ ముజామిల్ షకీల్ వంటి వారు దేశంలో షరియా పాలనను అమలు చేసేందుకు ఆపరేషన్ హెవెన్లీ హింద్ పేరుతో కుట్ర పన్నారు. నిందితుల్లో కొందరు విద్యావంతులైన వైద్య నిపుణులు కావడం గమనార్హం. వీరంతా జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా ఢిల్లీ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను విస్తరించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, డీఎన్ఏ వేలిముద్రల ద్వారా నిందితులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీరి నుంచి ఏకే-47 తుపాకులు, దేశవాళీ పిస్టల్స్ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>