కలం, వెబ్ డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol, Diesel Price) పెరుగుతాయని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. చమురు ధరలను పెంచుతూ ఆయిల్ సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజాము నుంచే పెరిగిన రేట్లు అమలులోకి రానున్నాయి. మధ్యపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో భారత చమురు సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol, Diesel Price) పెంచుతూ సామాన్యుడి పై భారం మోపాయి.
పెరిగిన రేట్లు ఇలా ఉన్నాయి..
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్ రూ.3 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే, డీజిల్ రేట్లు కూడా రూ.3 పెంచుతూ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 ఉండగా రూ.97.77 పెరిగింది. అలాగే, లీటర్ డీజిల్ ధరలు రూ. 87.67 నుంచి రూ.90.67 పెరిగాయి. కాగా, స్థానిక వ్యాట్, డీలర్ల కమిషన్ల ఆధారంగా రాష్ట్రాల్లో ధరల్లో స్పల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

