కలం, వెబ్ డెస్క్: మాజీ మావోయిస్టు, సామాజికవేత్త గాదె ఇన్నయ్య (Gade Innareddy)ను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మావోయిస్టు భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నాడన్నది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఎన్ఐఏ పోలీసులు ఇన్నయ్యను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఎన్ఐఏ అధికారుల ప్రకారం, గాదె ఇన్నారెడ్డి (Gade Innareddy) మావోయిస్టు సిద్ధాంతాలను సమర్థిస్తూ ప్రచారం చేస్తున్నాడని, నిషేధిత మావోయిస్టు సంస్థ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా యువతను ప్రభావితం చేసేలా ఆలోచనలను వ్యాప్తి చేస్తున్నాడన్న అనుమానాలతో విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
మావోయిస్టు కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరించడం, వారి ఆలోచనలకు మద్దతుగా ప్రచారం చేయడం, నిషేధిత సంస్థల భావజాలాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై ఎన్ఐఏ దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అతడిపై సేకరించిన ఆధారాల ఆధారంగా అరెస్టు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
ఇన్నారెడ్డికి సంబంధించిన పాత్రపై ఇంకా లోతైన విచారణ కొనసాగుతోందని, మావోయిస్టు నెట్‌వర్క్‌తో అతడికి ఉన్న సంబంధాలపై స్పష్టత కోసం రిమాండ్ సమయంలో ప్రశ్నించనున్నట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
Read Also: తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్
Follow Us On: Sharechat


