ముగిసిన డైవర్షన్… రేపటి నుంచి రాకపోకలు షురూ

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (Yellandu) క్రాస్ రోడ్డు నుండి బొమ్మనపల్లి క్రాస్ మధ్యగల లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (NH-930P)పై నిర్మించిన ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అమలులో ఉన్న ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటల నుండి వాహనాలు యథావిధిగా ఓవర్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

​వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రహదారిపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను, పోలీసుల సూచనలను గమనిస్తూ ప్రయాణించాలని డీఎస్పీ కోరారు. ప్రజలు, వాహనదారుల సహకారంతోనే ఈ మరమ్మత్తు పనులు సజావుగా పూర్తయ్యాయని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ నిర్వహణలో పోలీసు శాఖకు ప్రజల సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు.

​కాగా, ప్రజలకు ఎటువంటి రవాణా ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వేగంగా మరమ్మత్తు పనులను పూర్తి చేయడం పట్ల జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి పనులను విజయవంతం చేసిన ఇంజినీరింగ్ సిబ్బందిని, పోలీసు అధికారులను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>