కలం, వెబ్ డెస్క్: పెద్ద సంస్థలో ఉద్యోగం, ఐదంకెల జీతాన్ని కోరుకునే యువత ఉన్న ఈ రోజుల్లో.. తన ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన ఓ మహిళ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ (Nezrin Midhlaj) భారత పర్యటనలో ఉన్నప్పుడు కేరళలో ఒక ఆటో డ్రైవర్‌ను కలిశారు. సాధారణంగా మగవాళ్లే ఎక్కువగా ఆటోలు నడుపుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెజ్రిన్ ఎక్కిన ఆటో డ్రైవర్ ఓ మహిళ (Female Auto Driver). ఎంతో ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమెను చూసి నెజ్రిన్ ముచ్చటపడి ఆమె నేపథ్యం గురించి అడిగారు. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు విని ఆయన ఆశ్చర్యపోయారు. ఆమె గతంలో తొమ్మిదేళ్ల పాటు ఐటీ మేనేజర్‌గా పని చేశారని, కార్పొరేట్ ప్రపంచంలోని ఒత్తిడిని భరించలేక ఆ ఉద్యోగాన్ని వదిలేశారని తెలుసుకున్నారు.
కేవలం మానసిక ప్రశాంతత, సంతోషం కోసమే తాను సాఫ్ట్‌వేర్ రంగాన్ని వీడానని ఆ మహిళా డ్రైవర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు సుమారు రూ.60,000 సంపాదిస్తున్నానని, గతంలో కంటే ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, సంతృప్తిగా ఉన్నానని ఆమె (Female Auto Driver) గర్వంగా చెప్పారు. విజయం అంటే కేవలం పెద్ద పెద్ద హోదాలు మాత్రమే కాదని, వ్యక్తిగత ప్రశాంతత, సంతోషం కూడా విజయానికి కీలకమైన కొలమానాలేనని సదరు మహిళా ఆటో డ్రైవర్ నిరూపించారు. సక్సెస్ అనే పదానికి ఆమె సరికొత్త నిర్వచనం ఇచ్చారని, ఆమెలోని ఆత్మవిశ్వాసం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని నెజ్రిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఇక నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఐటీ జాబ్ టు ఆటో డ్రైవర్!
-కేరళలో ఐటీ ఉద్యోగం వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ!
From IT Cubicle to Auto Rickshaw!#ITtoAutoDriver #WomenEmpowerment #ViralStory #InspirationalWomen #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/WsjdXhQyz2— Kalam Daily (@kalamtelugu) May 30, 2026
Read Also: ఫేషియల్ హెయిర్‌తో బాధపడుతున్నారా? నిపుణులు చెప్పిన చిట్కాలివే
Follow Us On : WhatsApp

