Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్ షాక్‌తో నవ వివాహిత మృతి

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ నవ వివాహిత మృతి చెందింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బద్నపల్లి రేఖ (23) శుక్రవారం మధ్యాహ్నం దాబాపై బట్టలు ఆరవేస్తున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై చీర పడటంతో ఆమెకు కరెంట్ షాక్ తగిలింది.

దీంతో తీవ్రంగా గాయపడిన రేఖ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి వివాహమై కేవలం నాలుగు నెలలే కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Read Also: అంగన్‌వాడీలో అమానుషం.. చిన్నారిని కాలితో తన్నిన మహిళ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>