కలం, వెబ్ డెస్క్ : బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్నారిని ఓ మహిళ కాలుతో తన్ని అమానుషంగా ప్రవర్తించింది. అమ్మలాగా చూసుకోవాల్సిన అంగన్ వాడీలో ఈ దారుణం జరగడం గమనార్హం. మహారాష్ట్ర (Maharashtra) లోని పన్వెల్ ప్రాంతంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారిని పట్ల మహిళ క్రూరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంగన్వాడీ కేంద్రం మెట్లపై నిలుచున్న బాలికను ఓ మహిళ తన్నడంతో చిన్నారి కిందపడింది. మహిళ పదేపదే తన్నుతున్న ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మనస్సు కలుక్కుమంటోందని కామెంట్లు పెడుతున్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
A disturbing video from Maharashtra’s Panvel has triggered outrage after a woman was seen repeatedly kicking and assaulting a young girl studying at a local Anganwadi centre. The incident reportedly took place in Nandgaon village under Panvel taluka.#maharashtra #panvel… pic.twitter.com/hHSeOGBDmJ
— Deccan Herald (@DeccanHerald) June 26, 2026
Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!
Follow Us On: Instagram

