కలం, కరీంనగర్ బ్యూరో: ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ (Fee Reimbursement) నిధుల విడుదల కోసం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఏం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నేత దొగ్గలి శ్రీధర్ ప్రశ్నించారు. గత సంవత్సరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు కళాశాలల ఉనికిని కాపాడుతామని ప్రకటించి, ఇప్పుడు నిశ్శబ్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల బకాయిల విడుదల కోసం పోరాడిన దాఖలాలే లేవన్నారు.
అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం లేదు..
కాంగ్రెస్ అభ్యర్థి ప్రతి మూడు నెలలకోసారి నిధులు విడుదల చేయించి కాలేజీలను ఆదుకుంటామన్నారని శ్రీధర్ గుర్తు చేశారు. దీంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని డిగ్రీ, జూనియర్, ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు. అలాంటిది అధ్యాపకులకే కాలేజీలు జీతాలు చెల్లించే పరిస్థితిలో లేకుంటే, ఒక్కసారైనా స్పందించలేదని దుయ్యబట్టారు. ఫీజుల బకాయిలపై వెంటనే ఉద్యమించాలని, వారి వెంట ఉండాలని, నిధులు విడుదల చేసేంతవరకు పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: చిన్మయికి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: Instagram

